Jayam serial: పూజ పూర్తి చేసిన గంగ, రుద్ర.. పారుకి ఝలక్!
on Jan 11, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'Jayam'(జయం). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -165 లో.... గంగని తీసుకొని రుద్ర ఇంటికి వస్తాడు. ఇద్దరు కలిసి పూజలో కూర్చుంటారు. గంగ పూజకి వచ్చింది అంటే నా మాట మీద గౌరవం ఉన్నట్లే అని గంగ గురించి శకుంతల పాజిటివ్ గా అనుకుంటుంది.
మరొకవైపు గంగ అకాడమీలో లేదని పారుకి తెలిసి.. వెళ్లిపోతున్న మేడమ్ ని ఆపి "మేడం గంగ అకాడమీలో లేదు ఇంట్లో ఏదో పూజ జరుగుతుంటే అక్కడికి వెళ్లిందట" అని పారు అంటుంది. నీ మాటను నమ్మలేనని మేడమ్ అంటుంది. అక్కడ ఉన్న మేనేజర్.. గంగ వాళ్ల ఇంటికి వెళ్తే తెలుస్తుంది కదా మేడమ్ అని అంటాడు. దాంతో మేడం, మేనేజర్ కలిసి వెళ్తుంటే నేను వస్తానని పారు అంటుంది. ఇక వాళ్ళు ఒకే అనడంతో పారు కూడా వెళ్తుంది.
మరొకవైపు పూజ పూర్తి అవుతుంది. ఇక గంగని అకాడమీలో డ్రాప్ చేస్తానని రుద్ర అంటాడు. పూజ చేసిన వాళ్లు నిద్ర చెయ్యాలి కదా అని ఇషిక అంటుంది. అవును రేపు ప్రొద్దున దింపేసిరా అని శకుంతల అంటుంది. అ తర్వాత పారు, మేడం వాళ్ళు ఇంటికి వస్తారు. గంగ అకాడమీలో లేకుండా ఇంటికి వచ్చిందని తెలిసి మేడమ్ చెకింగ్ కి వచ్చారని పారు అంటుంది. చెక్ చేసుకోండి అని శకుంతల వాళ్లకి చెప్పగానే పెద్దసారు వాళ్ళు టెన్షన్ పడతారు.
మేనేజర్ చెక్ చేసి గంగ ఇక్కడ లేదని చెప్పగానే పారు షాక్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే చెకింగ్ కి రాగానే శకుంతల గంగ, రుద్ర దగ్గరికి వెళ్తుంది. గంగని వెనకాల నుండి డ్రైవర్ తో పంపిస్తుంది. మేడమ్ వాళ్ళు శకుంతల ఫ్యామిలీకి సారీ చెప్పి వెళ్ళిపోతారు. శకుంతల మంచి పని చేసిందని పెద్దసారు అంటాడు. పూజ అయ్యాక పంపిస్తానన్నాను పంపించానని శకుంతల అంటుంది. మేడమ్ వాళ్ళు అకాడమీకి వెళ్తారు. అక్కడ గంగ పూజ చేస్తూ కన్పిస్తుంది. దాంతో పారు షాక్ అవుతుంది. గంగ తన మాటలతో పారుకి చుక్కలు చూపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



